100 శతకములు

వేమన శతకము

1
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్పలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రిచెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. దీపం చిన్నదయినా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము.
2
ఆత్మ శుద్ధి లేని యాచారమదియేల?
బాండాశుద్ధి లేని పాకమేల,
చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా?
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఆచారాలు అంటూ గంతులు వేసే పెద్దలందరూ వినండి ఆచారాలు మూఢ నమ్మకాలుకాకూడదు. కుండ సరిగా లేకపోతే వంట రుచిగా రాదు. మనసు శుచిగా లేకపోతే నువ్వు పట్టువస్త్రము కట్టుకొని, దురాలోచన చేస్తూ ఇతరులకు కీడు తలపడుతూ, శివుని మీద పూలు వేస్తే, శివుడు నీకు మంచి ఫలితము నిస్తాడా? ( ఈయాడని భావము)
3
గంగిగోవుపాలు గంటెడైనను చాలు
కడివెడైననేమి ఖరముపాలు,
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మనసుంచి చేసిన వంట , పెట్టిన భోజనము సంతృప్తినిస్తుంది తప్ప, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, వేలం వెర్రిగా విందొనరించామని, వచ్చినవారి అజ కనుక్కోకపోతే అది తృప్తినిస్తుందా! కడవ నిండా గాడిద పాలున్నా మంచి గోక్షీరము రుచి దాని కొస్తుందా !
4
నిక్కమైన మంచినీలమొక్కటిచాలు,
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల,
చాటుమిలను చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- జాతిరత్నమొక్క దాని విలువ పూత మెరుగు రాళ్లకు రాదు. వేలాది పనికిరాని కవితల కన్న మంచి నీతిగల చాటు పద్యమొక్కటి చాలు అని తన పద్యముల విలువ చెప్పకనే చెప్పుకున్నాడు వేమన.
5
మిరపగింజచూడా మీద నల్లగనుండు
గొరికిజూడ లోనజుఱుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దీపము యొక్క కాంతి చాల దూరము ప్రసరించినట్లే సజ్జనుల యొక్క ప్రభావము చాలా దూరము పూవును. మిరపకాయ పైన నల్లగ నున్నను కారము ఎంత చురుక్కు మనునో సజ్జనుల ప్రభావము దుర్జనులను కూడా మార్చును.
6
మృగదంబుజూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- కస్తూరి రంగు నల్లగానున్నను దాని పరిమళము ఎంత మిన్ననో మంచివారి గుణములు ప్రజలు తలచుకొని మురిసిపోని రోజుడదు.
7
మేడిపండుచూడ మేలిమై యుండు
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చెడ్డవాడు పైకి మంచిగా కనిపించినప్పటికీ వానిచెడ్డగుణములు కీడునే కలిగించును. అది ఎట్లనగా మేడిపండులో పురుగులుంటే అవి పనికిరావు కదా.
8
నెరనన్నవాడు నెరజాణ మహిలోన
నేరునన్నవాడు నిందజెందు
ఊరుకున్నవాడే యుత్తమయోగిరా,
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- అన్ని తెలుసు అని అహంభావంతో ప్రవర్తించువాడు నిందల పాలగును. ఏమీ తెలియదని తెలుసుకో గోరినవాడు మౌనముతో అన్నియు తెలుసుకొనువాడు నీతిమంతుడు.
9
గంగ పారునెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్ద పిన్న తనము పేర్మియీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- అల్పులు దుష్టులు ఆవేశముతో, దుడుకు తనముతో, తొందరపాటుతో మెలుగుతారు. పెద్దవారు, మంచివారు, సజ్జనులు నిండుకుండ తొణకనట్లు నిండుగా, హుందాగా, వర్తిస్తారు, అది ఎట్లనగా గంగానది, గతి తప్పక హుందాగా ప్రవహిస్తే మురుగుకాలావ కలుషితమయిన నీటితో, దోమలు ఈగల మోతతో, రోగాలు వ్యాప్తిచెందించినట్లు.
10
నిండునదులు పారు నిలిచిగంభీరమై
వెర్రి వాగు పారు వేగంబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- అల్పజ్ఞుడు ఆవేశముతో అన్ని పనులను చెడగొట్టునటుల, సెలయేరు ఒడిదుడుకులతో ప్రవహించి అన్నింటిని ద్వంస మొనర్చినట్లే, వివేకవంతులు నిండునదులవలె నీతి బోధలోనర్చి, పనులు సఫలము చేయుదురు.
11
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కుజల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- బంగారపు శబ్దము కంచు శబ్దముకైన తక్కువైనట్లే మంచివారి మాటలు చల్లగాను నీతియుతంగాను ఉండి మంచినే పెంపొందిస్తాయి. నీచులకు వాగాడంబరం ఎక్కువ.
12
కులములోన నొకండు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఒక్క రాముని వలన ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట ఇనుమడించినట్లుగా, ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమునంతకు సువాసన వచ్చినట్లు ఒక్క గుణవంతుని వలన వంశమునకంతకు మంచిపేరు వచ్చును.
13
పూజకన్నా నెంచ బుద్ధిప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- బుద్ది నిలకడగా వున్న పూజ, నిలబెట్టుకొనిన మాట పేరు తెచ్చినట్లే మంచిగుణము, కులమేదైనను పేరుగాంచును. కుమ్మరివాడైన నంబి ప్రసిద్ధి చెందిన భక్తుడవలేదా!
14
ఉత్తముని కుడువున నోగు జన్మించిన
వాడు జెఱచు వాని వంశమెల్ల
జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చెరకుగడ చివరవెన్ను పుట్టిన తియ్యదనం కోల్పోయినట్లే మంచివాని కడుపున నీచుడు పుట్టిన వంశ ప్రతిషతను పాడుగావించును.
15
కులముల్లోన నొకడు గుణహీనుఁడుండిన
కులము చెడును వాని గుణమువలన
వెలయజెఱుకునందు వేనువెడలినట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- వెన్ను వల్ల చెరకుగడ తియ్యదనము కోల్పోయినట్లే కులములో ఒక నీచుడు పుట్టినచో వంశ గౌరవమును నాశనమొనర్చును.
16
రాముడోకఢుపుట్టి రవికుల మీడేర్చే
కురుపతి జనియించి కులముజేరచే
ఇలను బుణ్యబాప మీలాగు కాదోకా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- శ్రీ రాముడు రఘు వంశమునకు ఖ్యాతి తెచ్చాడు. కాని దుర్యోధనుడు వల్ల కురువంశం నాశనమైపోయింది. ఇలలో పాప పుణ్యములు ఈ విధముగా ఉండునని వీరు నిరూపించారు.
17
హీన గుణమువాని ననిలుసేర నిచ్చిన
ఎంతవానికైనా నిడుము గలుగు
ఈగ కడుపుజొచ్చి ఇట్టిట్ట సేయదా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఈగ కడుపులో చేరిన అతలాకుతలమైనట్లే నీచునితో సావాసమొనర్చిన వారు కింద మీదగుదురు.
18
వేరుపురుగుచేరి వృక్షంబుజెరచును
చీడ పురుగు జేరి చెట్టుచేర్చు
కుత్సితుండు చేరి గుణవంతుజెరచురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చెడ్డగుణము కలిగిన వారికి ఆశ్రయమిచ్చినవారే, పురుగుకు ఆశ్రయమిచ్చిన చెట్టు మూలచెదమగునట్లు, నాశనము పొందుదురు.
19
అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని
ఘనుడుగాడు హీన జనుడేగాని
పరిమళముల మోయ గార్దభము గజమౌనె
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- గంధములు మోయు గాడిదకు సువాసన రానట్లే విద్యలెన్ని నేర్చినను నీచుడు సుజనుడు కాలేడు.
20
విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండుకాదు
కొలని హంసలకడం గొక్కెర ఉన్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- కొలనులో హంసల నడుమ కొంగ యున్నను దాని జాతిభేదము గుర్తింపబడినట్లే విద్యాధికుల మధ్య అవివేకి యున్నను వానికి వివేకము కల్గదు.
21
అల్పజాతి వాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల దొలగజేయు
చెప్పుందినెడి కుక్క చెరుకు తీపెఱుగునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చెప్పులు తినే కుక్క చెరకు తియ్యదనం తెలిసికోలేనట్లు, గొప్పవారి గొప్పగుణములను నీచుడు తెలిసికోలేక అధికారము కలిగిన వారినందరిని వెడలగొట్టును.
22
అల్పుడైనవాని కధిక భాగ్యముగల్ల
దొడ్డవారి దిట్ఠి దొలగొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెఱుగునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- గడ్డికుప్పను కుక్క కావలి కాయుమన్న గడ్డి తనకు పనికిరాకున్నాను, అవసరమైన అవునైన దగ్గరికి రానీయదు. నీచునకు అధికారము కల్గిన సుజనులను దగ్గరికి రానీయడు.
23
ఎద్దుకైనఁగాని ఏడాది తెలిసిన
మాట దెలిసి నడచు మర్మమెరిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకు నైన
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- జంతువైనను శిక్షణ కల్గిన మనసెరిగి మసలుకొనును. మూర్ఖడు ఎంత శిక్షణ నొసగినను తెలియనితనమును పోగొట్టుకొనలేడు.
24
ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొమ్మబొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎలుక తోలును ఎంత ఉతికిన తెలుపు అవదు. మానవ స్వభావ సిద్ధములగు గుణములను ఎంత ప్రయత్నము చేసినను మార్చలేము. అది ప్రాణములేని కొయ్యబొమ్మను మాటాల్డుమన్నట్లుంటుంది.
25
పాముకన్న లేదు పాపిష్టిజీవంబు
అట్టిపాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరునులేరు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దుర్మార్గుడి దుర్లక్షణాలను మానిపించి సజ్జనుడుగా చేయుట చాలా కష్టము. అనితర సాధ్యము.
26
వేము పాలు వోసీ ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపిజెందబోదు
ఓగునోగెగాక యుచితజ్ఞు డెటులౌను
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- వేప చెట్టుకు పాలు పోసి పెంచినను తియ్యదనము తానట్లే, నీచునకు ఎన్ని నీతులు నూరిపోసినను సజ్జనుడు కాలేడు. అటువంటి నీచుని చెలిమి మనకు కుడా హానికల్గించును.
27
ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు
బరఁగ మూలికలకు బనికివచ్చును
నిర్దయాత్మకుండు నీచుడెందులాకౌను
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎంతో చేదు వృక్షములైన వేప, మనిషిణి చెట్లు సైతము మందుల తయారీలో ఉపయోగపడును. క్రురాత్ముడైన మానవుడు ఎవరికి ఉపయోగపడగలడు ?
28
పాలు పంచదార పాపర పండ్లలో
చాలపోసి వండచవికి రాదు
కుటిల మానవులకు గుణ మేల గల్గురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చెడుగావుండే పాపరపండ్లలో పాలు పంచదార వేసి వండితే తీయధనము రాదు కదా! అలాగే వంకర బుద్ధిగల నీచులకు ఎన్ని గుణములు కరిపినను బుద్ధిరాదు.
29
పాల నిడిగింట గ్రోలుచుండేనా
మనుజులెల్లగూడి మధ్యమండ్రు
నిలువదగని చోట నిలువ నిందలువచ్చు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- నిలువఁదగని చోట నిలిచి పని చేసిననూ అది చెడ్డపనే అని అన్పించుకొనును. అది ఎట్లన కళ్ళు అమ్మేవాని ఇంట్లో పాలు తాగినట్లు. ఇటువంటి పద్యమే సుమతీ శతకంలో కూడా కన్పిస్తుంది. శతకకర్తల భావముల సారూప్యము విదితము.
30
కానివానితోడ కలిసి మెలుగుచున్న
గానివానివలె కాంతురవని
తాడి క్రింద బాలు తాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- యోగ్యతలేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునే చేస్తుంది. తాడి చెట్టుక్రింద నిలబడి పాలుత్రాగినాను కల్లుత్రాగినట్లే అని అందురు.
31
తామాశించి చేయతగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమెయగును
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌనె
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- వచ్చికాయ వేగిరపడి ఆరగించినను పండుగానట్టే, మిగుల పండినను, కుళ్లినను పనికిరాదు. అలాగే సమయమునకు ముందుగాని మరీ వేళ తప్పిగాని ఏ పనిని చేయకూడదు. వేళ ఎరిగి పని చేయువాడే నిపుణుడు.
32
కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగుల గోడు గల్గు
కోపమడచనేని కోర్కెలీడేరు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- తన కోపమే తనకు శత్రువు. తన శాంతమే తనకు రక్ష కావున సమయమెరిగి పనిచేయువాడే నేర్పరి.
33
నీళ్లలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థాన బలిమి గాని తన బలిమి గాదురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎంత వీర్యవంతుడైనను తన చోటుకాని చోట ఓడిపోవును. నీళ్లలోని మొసలి ఏనుగునినను పట్టును బయట కుక్కయైనను మొసలిని ఓడించును. నెలవులు కానిచోట బలమొక్కటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను పరస్థలములందు రాణింపలేడు. 'స్థాన బలిమి' కున్న ప్రాముఖ్యము ఇంతింతనరానిది. పరమ శివుని మేడలో ఉంటే పాము కూడా తన శత్రువైన గురుత్మంతుని కుసలమడుగుతుంది. ఆ స్థానంలో లేకపోతే పరుగులిడుతుంది.
34
నీళ్లలోన మీను నిగిడి దూరము పారు
బయట మూరెడైన బారలేదు
స్థాన బలిమి గాని తన బలిమి గాదురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎంత వీర్యవంతుడైనను తన చోటుకాని చోట ఓడిపోవును. నీళ్లలోని మొసలి ఏనుగునినను పట్టును బయట కుక్కయైనను మొసలిని ఓడించును. నెలవులు కానిచోట బలమొక్కటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను పరస్థలములందు రాణింపలేడు. 'స్థాన బలిమి' కున్న ప్రాముఖ్యము ఇంతింతనరానిది. పరమ శివుని మేడలో ఉంటే పాము కూడా తన శత్రువైన గురుత్మంతుని కుసలమడుగుతుంది. ఆ స్థానంలో లేకపోతే పరుగులిడుతుంది.
35
నీళ్ళమీదనొడ నిగిడి తిన్నగా బ్రాకు
బయట మూరెడైన బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కోరగాడు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎంత వీర్యవంతుడైనను తన చోటుకాని చోట ఓడిపోవును. నీళ్లలోని మొసలి ఏనుగునినను పట్టును బయట కుక్కయైనను మొసలిని ఓడించును. నెలవులు కానిచోట బలమొక్కటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను పరస్థలములందు రాణింపలేడు. 'స్థాన బలిమి' కున్న ప్రాముఖ్యము ఇంతింతనరానిది. పరమ శివుని మేడలో ఉంటే పాము కూడా తన శత్రువైన గురుత్మంతుని కుసలమడుగుతుంది. ఆ స్థానంలో లేకపోతే పరుగులిడుతుంది.
36
కులము లేని వాడు కలిమిచే వెలయును
కలిమి లేని వాడు కులము దిగును
కులముకన్న భువిని గలిమియెక్కువసుమీ
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- సంపదయున్నను కులము, గోత్రము, వంశ గౌరవము, విద్యాధిక్యత ఇవన్నియు తృణప్రాయములే. ఏమనిన ఇవన్నియు ధనవంతుని అశ్రయింప వలసినదే.
37
కులము గలుగువాడు గోత్రంబు గలవాడు

విద్యచేత విర్రవీగువాడు
పసిడి గలుగు వాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- సంపదయున్నను కులము, గోత్రము, వంశ గౌరవము, విద్యాధిక్యత ఇవన్నియు తృణప్రాయములే. ఏమనిన ఇవన్నియు ధనవంతుని అశ్రయింప వలసినదే.
38
కనియు గానలేడు, కదలప డానోరు
వినియు వినగాలేడు విస్మయమున
సంపద తలవాని సన్నిపాతం బిది
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- సంపద కలవారిలో కొంతమంది రోగులు (సంపద అనే గర్వము తలకెక్కినవారు ) చూచి, విని కూడ, మధురముగా మాట్లాడినను లోక దర్సవులు గ్రహింపకుందురు.
39
ఏమిగొంచువచ్చే నేమి తాంగొనిపోవు
బుట్టువేళ నారడు గిట్టువేళ
ధనము లెచటికేగు థానేచ్చటికినేగు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- సంపదయంతయు శాశ్వతమని, దైవము లేడని, కనపడేదంతా తన ప్రజ్ఞేనని నమ్మేవాడు తానేమియు తీసుకురాలేడని, తీసుకుపోలేడని, ప్రాణము అశాశ్వతమని ఎరుగనివాడు.
40
తనువ దేవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొనగ
బ్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- సంపదయంతయు శాశ్వతమని, దైవము లేడని, కనపడేదంతా తన ప్రజ్ఞేనని నమ్మేవాడు తానేమియు తీసుకురాలేడని, తీసుకుపోలేడని, ప్రాణము అశాశ్వతమని ఎరుగనివాడు.
41
గొడ్డుటావు బితుకఁ గుండగొంపోయిన
పండ్లురాలదన్ను బాలవిదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- పిసినారిని ధనమడుగ బూనుట పాలీయని అగువద్దకు వెళ్లితన్నులు తినుట వంటిది. మేక మెడ చన్నులను పితుకుటవంటిది. ప్రయోజనాసున్యములైన పనులను విజ్ఞుడుచేయడు.
42
మేక కుతుక బట్టి మెడచన్ను గుడవగా
ఆకలేక మాను నాశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- పిసినారిని ధనమడుగ బూనుట పాలీయని అగువద్దకు వెళ్లితన్నులు తినుట వంటిది. మేక మెడ చన్నులను పితుకుటవంటిది. ప్రయోజనాసున్యములైన పనులను విజ్ఞుడుచేయడు.
43
పెట్టిపోయలేని వట్టినరులు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- పుట్టలోని చెదలు వున్నా చచ్చినా లాభంలేనట్లే మంచిగుణములు ( దాతృత్వము మొదలగునవి) లేని మానవుడు ప్రయోజనాసున్యుడు.
44
ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుంద్రు భ్రమను ్రిప్పలేక
మురికి కుండమందు ముసురునీగల భంగి
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఈ శరీరము శాశ్వతమను భ్రమతో పరమార్థమరయగ లేని వాడు బతికినను చచ్చినను ఒక్కటే.
45
నీళ్లలోన మీను నెరమాంస మాశించి
గాలమందు జిక్కు కరణి భువిని
ఆశదగిలి నరుడు నాలాగు చెడిపోవు
విశ్వదాభిరామ వినుర వేమా.,
భావము:- ఆశా పాశమునకు లోనయినవారు పరమాత్మపైన ద్యాస నిలుపలేరు. ఐహిక భోగ భాగ్యములపైననే వారి ద్యాస.
46
ఆశ పాపజాతి యన్నిటికంటెను
ఆసచేత యతులు మోసపోరే
చూచి విడచు వారె శుద్ధాత్ములెందైన
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఆశా పాశమునకు లోనయినవారు పరమాత్మపైన ద్యాస నిలుపలేరు. ఐహిక భోగ భాగ్యములపైననే వారి ద్యాస.
47
అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్నగురునికన్ననెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దానములలో అన్నదానము, తల్లిని మించిన దైవము, జ్ఞానప్రదాత అయిన సద్గురువు కంటె గొప్పవిలేవు.
48
ఆశకోసివేసి యనలంబుచల్లార్చి
గోచిబిగియగట్టి గుట్టుదెలిసి
నిలిచినట్టు వాడే నెఱయోగిఎందైన
విశ్వదాభిరామ వినుర వేమా.ి.
భావము:- పరిపూర్ణుడయిన యోగి అరిషడ్గర్వములను జయించినవాడే
49
కనకమృగము భువిని గుద్దు లే ధనకయె
తరుణి విడచి చనియె దాసారథియు
దెలివి లేనివాడు దేవుడెట్లాయెరా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- భార్య కోరినదని మంచి చెడు విచారింపక మాయలేడి వెంట పరుగులిడిన రాముడు దేవుడెలాగయాడు.
50
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పెరకి తినును బరుగ గ్రద్ద
గ్రద్దవంటివాడు గజపతి కాడొకో
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దుర్మార్గుడయిన రాజు చచ్చిపడియున్న శవములను తిను గ్రద్దవంటివాడు.
51
అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను
కలనుం గాంచులక్ష్మి కల్లయగును
ఇలను భోగ భాగ్య మీతీరు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఇలలో కలిమి లేములు అలలతో కూడిన నీటి బుడగలు వంటివి. కలయందు కన్పించుసంపదవంటివి. అజ్ఞానియే వీటిని స్థిరమని తలచును.
52
కోతి నొకటిదెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చెడ్డవారి దగ్గర చెడ్డవారే చేరుదురు. నీతిమంతులు వారి వద్దకు పోరు.
53
కల్లలాడువాని గ్రామకర్త యెరుగు
సత్య మాడువాని స్వామి యెరుగు
బెద్దతిండిపోతు బెండ్లామెరుంగురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- విశ్వమంతా వ్యాపించిన వాడా ఓ రామచంద్రా! అబద్ధములాడు వారిని వారి స్నేహితులు గ్రహించిన చందంగా నిజమును నీవొక్కడవే గ్రహించగలవు. భార్య యెక్కతే భర్త యొక్క భోజనపు తీరును గ్రహించి తగిన భోజనము పెట్టగలదు.
54
కల్ల నిజములెల్ల గరళకంఠుడెఱుంగు
నీరు పల్లమెరుగు నిజాముగాను
తల్లితానెఱుంగు తనయుని జన్మము
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- తన కొడుకు పుట్టుక గూర్చి తల్లికే తెలియును. నీరు ఎగువకు పారాదు పల్లమునకే పారును. నిజానిజాములను గూర్చి పరమ శివునకు తప్ప ఎవరికి తెలియును.
55
మైలాకోకతోడ మాసిన తలతోడ
నొడలు మురికి తోడ నుండెనేని
నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- వేష భాషలకున్న ప్రాముఖ్యము ఈ పద్యమునందు వర్ణింపబడెను. ఎంత వున్నత వంశంలో పుట్టినా మాసిన విలువలు, మాసిన జుట్టు కలిగి, స్నానపానములు లేని వ్యక్తిని ఎవరును గౌరవింపరు. ఆ కాలములో అప్పులేని వాడే అధిక ధనవంతుడని వేమన చెప్పినా ఈ రోజుల్లో ఎంత అప్పువుంటేనే అంత ధనవంతుడని నానుడి వచ్చింది. ఉప్పులేని కూర రుచించదు పప్పులేని కూడు బలమునియ్యదు. అప్పుజేసినా ధనము సంపాదించ కల్గిన వాడే ధనవంతుడని ఇప్పుడు పద్యము మార్చుకోవాలి.
56
ఉప్పులేని కూర యెప్పుదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పులేనివాడే యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినుర వేమా..
భావము:- వేష భాషలకున్న ప్రాముఖ్యము ఈ పద్యమునందు వర్ణింపబడెను. ఎంత వున్నత వంశంలో పుట్టినా మాసిన విలువలు, మాసిన జుట్టు కలిగి, స్నానపానములు లేని వ్యక్తిని ఎవరును గౌరవింపరు. ఆ కాలములో అప్పులేని వాడే అధిక ధనవంతుడని వేమన చెప్పినా ఈ రోజుల్లో ఎంత అప్పువుంటేనే అంత ధనవంతుడని నానుడి వచ్చింది. ఉప్పులేని కూర రుచించదు పప్పులేని కూడు బలమునియ్యదు. అప్పుజేసినా ధనము సంపాదించ కల్గిన వాడే ధనవంతుడని ఇప్పుడు పద్యము మార్చుకోవాలి.
57
చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
నేనుపగొద్దు పాలవెంత హితము
పదురాడుమాట పాటిఐ ధర్మ జెల్లు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- "పదుగురాడు మాట పాటియై ధరఁజెల్లు" అది న్యాయమా, అన్యాయమా, సత్యమా, అసత్యమా అది ఎవరును విచారింపరు. పదిమంది మంచిదన్న అదిమంచిది అని నమ్మి ఆచరించెదరు.
58
పట్టుపట్లరాదు వట్టి విడువరాదు
పట్టెనేని బిగియ బిట్టవలెను
పట్టిడుచుకన్న బడి చచ్చుటయే మేలు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఏ విషయములోనైనా పట్టుదల పట్టిన అంతము వరకు దానిని నిలుపుకునే తీరవలెను. అలాగాక దానిని మధ్యలో వాడాలి వేయువారు మూఢులు. ఇదే రీతిని భాతృహరి నీతి శతకంలోనూ సుమతీశతకంలోనూ కూడ పట్టుదల విషయంలో పద్యాలూ వున్నవి. సతకకర్తలు ఈ భావంలో ఏకీభవించారనుకోవాలి.
59
తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెఱుగరు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఒక వేలు ఒరులు వైపు, చూపి తప్పు లెన్నువారు తమలోని తప్పులెరుగలేరు. మూడు వేళ్ళు తమవైపే ఉంటాయన్న నిజాన్ని కూడా వారు చూడలేరు. మేమంతా అలాంటి మూఢులమే అని వేమన రామునికి విన్నవించుకుంటాడు.
60
అనగా ననగ రాగ మాతిశయిల్లుచునుండు
దినగదినగ వేము తియ్యగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- అన్న విధంగా ఈ శతకకారుడు కూడా "సాధనమున పనులు సమకూరు ధరలోన" అని అన్నాడు. పాడగా, పాడగా గొంతు సాగినట్లే, తినగా తినగా చేదు తియ్యనైనట్లే, కష్టపడితే సాధించలేని పనులు లేవు. దృఢసంకల్పమున్నప్పుడే, ఏ పనైనా చేసి తీరాలన్న పూనికవున్నప్పుడే, అది సమకూరుతుంది.
61
తనకుగల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులఁగాంచి
చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- నీచుడు ఎంతసేపూ తప్పులు కనుగొనుటకే చూచును తప్ప తన తప్పులు తెలిసికోలేడు. తన లోపములెరిగిన వాడే ధీమంతుడు.
62
ఇనుము విరిగెనేని యిమారు ముమ్మారు
కాల్చి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరికూర్చ వచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎదుటివారి మనసు నొప్పించుట ఎవరికిని భావ్యము కాదు. ఒకసారి ఒకరిపట్ల మనసు నోచుకొనెనా అది సరిచేయుట బ్రహ్మకైనను సాధ్యముకాదు. అదే ఇనుపవస్తువైతే తిరిగి అతకవచు. అందుకే మాటలాడునపుడు ఆచి తూచి మాటలాడవలెను. మాట పరుషమైన మనసు ఎంత మంచిదైనను మన్నన పొందలేడు.
63
ఓరుని జెఱదమని యుల్లమందెంతురు
తమకు జేరురుగని ధరణి నరులు
తమ్ము జెఱచువాడు దైవంబులేడొకో
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- అజ్ఞానులు ఎపుడు ఎదుటివారికి కీడు చేయుటకే తలచెదరు. తమకు కూడ కీడు కల్గజేయుటకు దైవమున్నాడని ఎరుగరు. ఒకనికి ఒక కన్ను పోవలెనని కోరిన మనకు రెండు కళ్ళు పోవునని యెరుగనివాడే మూర్ఖుడు.
64
కానివానిచేత గాను వీనంబిచ్చి
వెంట దిరుగువాడే వెఱ్ఱివాడు
పిల్లి తిన్న కోడి బిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దైవమునకైనను స్తోత్రములు చెప్పనిదే వరములు రావు. మానినులకైనను మంచి మాటలు చెప్పనిదే మసివ్వరు. ఎదుటివారి నుంచి నీకేదైనా కావలెనన్న మంచి మాటలే మార్గము. మాట పొందిక లేకున్నా కానీకి కొఱగాడు.
65
మాటలాడనేర్చి మనసు రంజిల్లజేసి
పరగబ్రియముచెప్పి బడలకున్న
నొకరిచేతి సొమ్ములూరక వచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దైవమునకైనను స్తోత్రములు చెప్పనిదే వరములు రావు. మానినులకైనను మంచి మాటలు చెప్పనిదే మసివ్వరు. ఎదుటివారి నుంచి నీకేదైనా కావలెనన్న మంచి మాటలే మార్గము. మాట పొందిక లేకున్నా కానీకి కొఱగాడు.
66
చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని గీడు సేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- చంపదగిన శత్రువు చేతికి చిక్కినా ఉపకారము చేయుటయే మేలు. తన యంతటతాను ఇంటికి వచ్చిన శత్రువునైనను ఆదరించుటలోనే గొప్పతనము కనపడును.
67
వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరదపారు
వరద కరువు రెండు వారసతో నెఱుగుడీ
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దేనికీ అతి పనికిరాదు. వానలు కురియాకున్ననూ ఎక్కువ కురిసిననూ కరువే. సమముగా మితముగా వున్నపుడే సుఖసంతోషములు వెల్లివిరియును.
68
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
బుట్టునా జగంబు పట్లడేప్పుడు
యముని లెక్కరీతి నరుగుచు నుందురు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- పుట్టిన వారందరూ స్థిరముగా నిలచిన భూమియందు చోటు చాలదు. అందుకే యముడు ఆయువు నిండిన వారిని కొనిపోవుచుండును.
69
వాన రాకడయును బ్రాణంబు పోకడ
కాన బడవెంత ఘనునకైనా
గానబడినమీద గలియెట్లు నడచురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసిన మనిషి భగవంతుడే అగునుకదా! అటువంటపుడు ఇది కలియుగ మెలాగవుతుంది.
70
చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయే
నీటిబడ్డ చినుకు నీటగలిసి
బ్రాప్తి కలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- లభించిన చోటును పట్టి మన సుఖ దుఃఖములు కల్గును. వాన చినుకు ముత్యపు చిప్పలోబడిన ముత్యమగునట్లే మనకు రాజాశ్రయము దొరికిన ప్రకాశించెదము.
71
ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను
అంటనీయక శని వెంటదిరుగు
భూమి క్రొత్తదైనా భోక్తలు క్రొత్తలా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఏలిన నాటి శని పట్టినపుడు ఎన్ని చోట్ల తిరిగినను దుఃఖములు తప్పవు. తన కర్మానుభవము ఎక్కడ పోయినా పట్టి పీడిస్తుంది.
72
కర్మమెప్పుడైన గడచిపోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగనిచోట
గంకుభట్టుజేసే గాటకటా దైవంబు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- కర్మానుభవము ఒక్కోసారి హీనుల దగ్గర కూడ ఒదిగియుండునట్లు చేయును ధర్మరాజు విరాటుని దగ్గర కంకుభట్టుగా ఉన్నట్లు.
73
అనువుగానిచోట నధికుల మనరాదు
కొంచెమైన నదియు కొదువగాదు
కొండ యద్దమందు గొంచెమైయుండదా
విశ్వదాభిరామ వినుర వేమా.,
భావము:- పెద్దకొండ కుడా అద్దమందు ప్రతిభింభములో చిన్నదిగా కనిపించినా దాని గొప్పదనంతగ్గినట్లే మనుజుడు కానిచోట్ల అహంకరింపగూడదు.
74
ఇమ్ము దప్పువేల నెమ్మలన్నియుమాని
కాలమొక్కరీతిగల గడప వలయు
విజయ డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ వినుర వేమా.,
భావము:- సమయా సమయముల కనిపెట్టి గొప్పవాడైనను అవసరమునకు ఆడంబరములు ప్రదర్శింపక ఏదో ఒక విధంగా కాలంగడుపవలెను. అర్జునుడంతమహాపరాక్రమవంతుడు కూడా కాలము కలిసిరాక విరాటుని కొలువులో పేడి రూపముతో బ్రతకలేదా!
75
చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్క కఱచి బాధ పెట్టు
బలమిలేని వేళవంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- బుద్దిమంతుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడ దృష్టియందుంచుకొని, నెలవును చూచికొనియే తన బలమును చూపవలెను. లేనియెడల అల్పుడు కుడా అతనిమదమును అణచును. చాలావరకు ఈ పద్యములన్నియు స్థానబలిమిని, కాలం కలిసివచ్చుటను గూర్చి చెప్పును.
76
లక్ష్మియేలినట్టి లంకాపతి పురమ్ము
పిల్లకోతిపౌజు కొల్లబెట్ట
చేటుకాలమయిన జేరప నల్పులె చాలు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- కాలం కలిసి రానపుడే తాడే పామై కరచును. విధి ఎదురు తిరిగినప్పుడు లక్ష్మితో కళకళలాడు లంకాపురమును అల్పుడయిన వానరుడు చెరుపకలిగెను.
77
మొదట నాశబెట్టి తుదిలేదుపొమ్మను
పరమ లోభులైన పాపులకును
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- వాగ్దాన భంగము కావించిన వాని శవమును కుక్కలు కూడా ముట్టవు. నిరాశ చెందినవారి శాపము ఉండేలు దెబ్బవంటిది. దానమిచ్చు ఉద్దేశ్యము లేనపుడు వాగ్దానము చేయకూడదు.
78
ఇచ్చువానియొద్ద నీనివాడుండేనా
చచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చుపోదున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- లోభివాని దగ్గర దాతయున్నను అతని దాతృత్వము సాగదు. కల్పవృక్షము నివారించి ముండ్లపాద యున్న జనులు కల్పవృక్షము చెంత చేరరు.
79
అరయ నాస్తియనక యడ్డుమాటాడక
తట్టువడక మదిని దన్నుకొనక
తనది గాదనుకొని తాబెట్టునదే పెట్టు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఏ దానమన్న విశేష ఫలమియ్యవలెనన్న యాచకుని కోర్కెను తక్షణమే తీర్చుట.
80
ధనముగూడఁ బెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనక
తెనేనిగా కూర్చి తెరువర కియ్యదా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- తేనెటీగలు తేనే కూడ బెట్టి పరులకిచ్చినట్లు ఇతరులకు దానము చేయక తానూ తినక కూడబెట్టినవాడు లోభియనిపించుకొనును. ఇలాంటి పద్యమే సుమతీ శతకంలో కూడా కలదు.
81
కొంకణంబుపోవ గుక్క సింహముగాదు
కాశికారుగా బంది గజముకాదు
వేరుజాతి వాడు విప్రున్డు కాలేడు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- బ్రాహ్మణుడన్న బ్రహ్మజ్ఞానము కలవాడు. కానీ ఇతరుడుకాదు. వేరు వేరు చోట్ల తిరిగినా మనుజుడు తన స్వభావము (నైజము) మార్చుకోలేడు.
82
తవిటి కరయ వోవ దండులంబులగంప
శ్వాసమాక్రమించు సౌమ్యామగును
వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- తనకున్న దానితో తృప్తిపడక వేరు వేరు లాభములకాసపడువాడు వున్నది కుడా పోటుట్టుకొనును.
83
దాతకానివాని దఱచుగా వేడిన
వాడు దాత యౌనె వసుధలోన
ఆవురు దర్బయౌనె యబ్ధిలోముంచిన
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- దాతకాని వానిని ఎన్నిసార్లు వేడిననూ, సముద్రజలములో ముంచిన ఎండుగడ్డి థర్బ కానట్లే, ఫలమును పొందజాలడు.
84
పరగ ఱాతిగుండు బగులగొట్టగ వచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎన్ని అసాద్యములయిన పనులనయిన (ఇసకనుంచి నూనెను తీయుట, కొండను పిండి గొట్టుట, రాయిని ఆరుగాదీయుట, వంపుకర్ర వంపుతియుట) చేయవచ్చును కానీ "కఠిన చిత్తుని మనసు" కరిగింపలేము. మూర్ఖుని తెలివిగల వానిగ చేయలేము.
85
వంపుకర్ర గాల్చి వంపు దీర్చగవచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎన్ని అసాద్యములయిన పనులనయిన (ఇసకనుంచి నూనెను తీయుట, కొండను పిండి గొట్టుట, రాయిని ఆరుగాదీయుట, వంపుకర్ర వంపుతియుట) చేయవచ్చును కానీ "కఠిన చిత్తుని మనసు" కరిగింపలేము. మూర్ఖుని తెలివిగల వానిగ చేయలేము.
86
విత్తముగలవాని వీపున బుండైన
వసుధలోనజాలా వార్త కెక్కు
బేదవానియింట బెండైన నెఱుగరు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ధనవంతుని ఇంట ఏ చిన్న కార్యము జరిగినను బహుళప్రచారము పొందును, పేద వాని ఇంట పెద్దకార్యములకు కుడా ప్రచారము లభింపదు.
87
మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునొందు
గలిమి లేమి రెండుగల వెంతవారికి
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మగానికాలము స్త్రీ కష్టపడిన కొడుకు కాలములో సుఖపడవచును, కలిమి లేములు కావడికుండలని ఒకదాని వెనుక ఒకటి వచ్చుచుండునని సుఖంలో పొంగిపోక దుఃఖంలో కుంగిపోని వాడే ధీరోదాత్తుడు.
88
తనకులేని నాడు దైవంబు దూరును
దనకు గలిగెనేని దైవమేల
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మానవునకు దేవునకు కలుగు సంబంధము యెట్టిదో ? సుఖపడుకాలమున అంతయూ తన మహిమేనని, కష్టపడునపుడు నీదే భారమును మనుజుడు ఎంత నికృష్టుడో కదా!
89
గాజు కుప్పెలోన గదలక దీవంబ
దెట్టులుండు జ్ఞాన మట్టులుండు
తెలిసినట్టి వారి దేహంబులందున
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- పరమాత్మ స్వరూపమును తెలిసికొన్న వారి జ్ఞానదీపము వారినే గాక వారి నాశ్రయించిన వారిని కుడా మోక్షపదమును చేర్చును.
90
అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనే మనుజుడుండు
ఇతరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మనుజుడు తనలోని భావములను ఎన్ని దాచుకొన్నను సర్వాంతర్యామియయిన భగవంతుని ముందు దాచలేడు కదా!
91
చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింక జదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యను
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- ఎన్ని చదువులు చదివి ఎంత విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనుజుడు మూర్ఖుడే కదా!
92
జననమరణములకు సర్వస్వతంత్రుడు కాడు
మొదట గర్త కాండే తుదనుకాడు
నడుమగర్త ననుట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మూర్ఖుడు తన జనన మరణములకు అన్నింటికీ తానే కర్తయని విర్రవీగును. సుబుద్ధి ఆత్మతత్వమును తెలిసికోగలిగియుండును.
93
నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటి మాటికెల్ల మారును మూర్ఖున్డు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మూర్ఖుని స్వభావము మాటిమాటికి మారిపోటూవుంటుంది. అది నీటిమీద వ్రాతవలె విలువలేనిది.
94
తల్లియున్నయపుడె తనదు గారాబము
లామె పోవదన్ను నరయరెవరు
మంచికాలమపుడె మర్యాదనార్జింపు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- కాలం కలసి వచ్చినపుడే గౌరవ మర్యాదలు ఆర్జించుకోవలెను. లేనపుడు ఎందుకూ కొరగారు. అది ఎట్లన తల్లి బ్రతికియున్నపుడే గౌరవము సాగినట్లు.
95
మాటలాడవచ్చు మనసుదెల్పగలేడు
తెలువవచ్చుదన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు సూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మనసెరిగి మాటలాడు వాడే నేర్పరి. కత్తిపట్టిన వాడంతా సూరుడుకానట్లే అందరూ నేర్పరులుకాలేరు.
96
శాంతమే జనులను జామునొందించును
శాంతముననే గురుని జాడ తెలియు
శాంత భావమహిమ జర్చించలేమయా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- శాంతము యెక్క గొప్పదనము ఇంతింతనరానిది. శాంతాకుతో సాధించరానిది లేదు.
97
ఆడితప్పువారలాభిమాన హీనులు
గోడెఱుగని కొద్దివారు
కూడి కీడు సేయగ్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- క్రూరులు మంచివారిలా కన్పిస్తారు. ఆత్మాభిమానం వదలి, మంచి చెడ్డాయనక అబద్దాలతో బ్రతుకుతారు. క్రురాత్ముల స్వభావము నెవరును మెచ్చుకొనలేరు.
98
తరచూ కల్లలాడు ధణీసులిండ్లలో
వేళవేళ లక్ష్మి వెడలిపోవు
నోటికుండలోన నుండునా నీరంబు
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- అబద్దాలడితే రాజులైనా సరే వారి ఇండ్లలో సంపద నశించిపోవును. చిల్లికుండలో నీరు నిలవనట్లే అసత్యమునకు విలువయుండదు. కాబట్టి అసత్యాలు ఆడరాదు. అవి ఎలాగో బయటపడతాయి.
99
చంపగూడదెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిఁగొట్టందే లేమి చేయురా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మనము ఏ క్రూరజంతువును చంపరాదు. ఈ లోకములో హింసాప్రవృత్తిని, చేదు బుద్దిని వదిలివేయాలి. తేలుకొండిని తీసివేస్తే తేలునుంచి ఎటువంటి హాని కలుగదు.
100
ఆత్మయందే దృష్టి ననువగా నొనరించి
నిశ్చలముగా దృష్టి నిలిపెనేని
అతడునీవె నమ్మి యనుమానమేలరా
విశ్వదాభిరామ వినుర వేమా.
భావము:- మనస్సులోనే ఆత్మను అచంచల ఏకాగ్రతతో దర్శించిన మోక్షమ్మును పొందవచ్చు. గురూపదేశము వలెనే ఇది సాధ్యము. హింసా ప్రవృత్తిని తొలగించిన ప్రపంచమంతయు శాంతితో నిండియుండును. (). మోక్షమును పొందుటకు ఏకాగ్రత పెంపొందించుకొనవలెను. అది గృపదేశమువలనే సాధ్యము. "విశ్వధాభిరామ" వినురవేమ అను మకుటంలోనే వేమన తాన్ విశ్వదృష్టిని చూపించాడు. తాను విశ్వమంతా వ్యాపించినవాడట. అంటే తానూ చెప్పిన నీతులు వర్తించనివారు ఎవరూ లేరని, మూర్ఖులను సుబుద్దులను, హీనులను, గుణగరిష్ఠులను, రాజులను, పేదలను, స్థానబలిమి గలవారిని, లేనివారిని అందరిని, అన్నివిధాలా తట్టిలేపి, చిట్టచివరికి గురువే అందరినీ దరి జేర్చువాడని దైవమును చూపించువాడని చెప్పిన ధీమంతుడు.
Telugu Language Telugu People Telugu Tanamu Telugu Danamu Padyalu Telugu Padyalu Veemana sumati Satakamu Satavadanamu Avadanamu avadani Telugu Desam India andhra Pradesh Telangana Bharatadesam Bharatamaata andhramaata andhra maata PongalDeepavaliDasara Sankranti muggulu Gobbamma Pujari Haridasu Harikatha Burrakatha Tappeta taalam Tappetloi Tallaaloi Chitti chilakamma amma kottindaa nanna Tandri Talli Sivudu parvati vishnuvu Brahma Trilokam paatalam Telugu Families Jr. NTR Taraka Rama Rao Chiranjeevi Rajanikanth Balakrishna Venkatesh Nagarjuna Raviteja Telugu songs Telugu Movies Telugu Samskruti Telugu Sanskriti ammamma nanamma taatayya mamayya attamma tammudu chelli akka attamma attayya atta koduku kumarudu kumarte bavagaru bamardi chellela tammudaa bojanam kura annam pulagura chintaku santosham anna stri janma ajanma velugu telugu velulugu bhakti bakti rakthi sakthi ekkada akkada narinja battai pandu sunnunda margamu bhakthi margamu srujana sruti laya layabaddamga janama bhumi chandra sekhara rao chandra babu naidu KTR NTR TRS YSR TDP Congress YS Jagan Visakhapatnam Vijayawada Guntur Nellore Kurnool Kadapa Rajahmundry Kakinada Tirupati Anantapur Vizianagaram Eluru Ongole Nandyal Machilipatnam Adoni Tenali Proddatur Chittoor Hindupur Bhimavaram Madanapalle Guntakal Srikakulam Dharmavaram Gudivada Narasaraopet Tadipatri Tadepalligudem Amaravati Chilakaluripet West Godavari Kakinada Makar Sankranti Pongal ongal Vasant Panchami Saraswati Thaipusam Kavadi Maha Shivaratri Holi panchami Vasant Navratri Bhajan Rama Navami Gudi Padwa Ugadi Hanuman Jayanti Pournima Bonalu Bathukamma Guru Purnima Sanyasi puja Mahalakshmi Vrata Raksha Bandhan Krishna Janmaashtami Govinda Radhastami Gowri Ganesh Chaturthi Navarathri Vijayadashami Durga Puja Deepavali Rangoli Kartik Poornima Sashti purthi Prathamastami Yatra Deepam Pancha Ganapati Kumbh Mela Godavari Pushkaram Purna Kumbha Mela krishna pushkaram

No comments:

Post a Comment